News August 15, 2025
అవకాడో విత్తనంపై ‘భరతమాత’!

ఆళ్లగడ్డకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు విజయ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా వినూత్న ఆలోచనతో ‘అవకాడో’ విత్తనంపై భరతమాత సూక్ష్మచిత్రాన్ని పలు రంగులతో చిత్రించారు. సన్నని విత్తనంపై అద్భుతమైన ఆకృతులు, సున్నితమైన రంగుల సమ్మేళనంతో తీర్చిదిద్దిన ఈ కళాఖండం చూసిన వారిని మంత్రముగ్ధులను చేస్తోంది. వైవిధ్యభరితమైన చిత్రాలతో ఇప్పటికే ప్రజల ప్రశంసలు పొందిన విజయ్, ఈ సృజనతో తన ప్రతిభను మరొకసారి చాటుకున్నారు.
Similar News
News August 15, 2025
ఇవాళ టీవీలో వచ్చే దేశభక్తి సినిమాలు ఇవే

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీవీ ఛానల్స్‌లో ఎన్నో మంచి దేశభక్తి చిత్రాలు ప్రసారం కానున్నాయి. *జెమినీ టీవీ: మ.2.30 గం.కు మేజర్ చంద్రకాంత్ *జెమిని లైఫ్: ఉ.11గం.కు అల్లూరి సీతారామరాజు *జెమిని మూవీస్: మ.1 గం.కు ఖడ్గం, సా.4 గం.కు మహాత్మ, రా.10 గం.కు మేజర్ *జీ తెలుగు: సా.4 గం.కు సుభాష్ చంద్రబోస్ *జీ సినిమాలు: ఉ.9 గం.కు ఉరీ ది సర్జికల్ స్ట్రైక్స్ *స్టార్ మా మూవీస్: సా.6 గం.కు అమరన్.
News August 15, 2025
EP36: శత్రువులను ఎలా గెలవాలంటే: చాణక్య నీతి

ప్రతి వ్యక్తికి మిత్రులే కాదు.. శత్రువులు కూడా ఉంటారు. అలాంటి విరోధిని ఎలా గెలవాలో చాణక్య నీతి వివరిస్తోంది. ‘మీ శత్రువు ముందు మీరు ఆనందంగా ఉండండి. మీ విజయాలను వారికి తెలిసేలా చేయండి. మీ సంతోషం, మీ ఎదుగుదలే ఆ శత్రువులను అథఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇంతకన్నా మీరు వారిపై మరే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని చెబుతోంది.
<<-se>>#Chankyaneeti<<>>
News August 15, 2025
తిరుపతి IITలో ఉద్యోగాలకు దరఖాస్తులు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 25.