News August 15, 2025

ఆగస్టు 15: చరిత్రలో ఈ రోజు

image

1769: ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ జననం
1872: యోగి, జాతీయవాది శ్రీ అరబిందో(ఫొటోలో) జననం
1945: నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహరావు జననం
1947: భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం
1961: సినీ నటి సుహాసిని జననం
1964: సినీ నటుడు శ్రీహరి జననం
1971: బహ్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం
1975: భారత మాజీ క్రికెటర్ విజయ్ భరద్వాజ్ జననం
2018: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ మరణం

Similar News

News August 15, 2025

రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి

image

AP: తెల్లవారుజామున రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి HYD వెళ్తుండగా ఘటన జరిగింది. ముందు వెళ్తున్న బస్సును వెనక వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News August 15, 2025

నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

image

AP: రాష్ట్ర సచివాలయంలో ఇవాళ్టి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించనున్నారు. సచివాలయ ప్రాంగణంలో జూట్ బ్యాగుల స్టాల్‌ని కూడా ప్రారంభించారు. వచ్చే జూన్ 5నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న CM చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు సచివాలయం నుంచే చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి అక్కడ ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, ప్లేట్ల వాడకంపై నిషేధాన్ని అమలు చేయనున్నారు.

News August 15, 2025

ఇవాళ టీవీలో వచ్చే దేశభక్తి సినిమాలు ఇవే

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీవీ ఛానల్స్‌లో ఎన్నో మంచి దేశభక్తి చిత్రాలు ప్రసారం కానున్నాయి. *జెమినీ టీవీ: మ.2.30 గం.కు మేజర్ చంద్రకాంత్ *జెమిని లైఫ్: ఉ.11గం.కు అల్లూరి సీతారామరాజు *జెమిని మూవీస్: మ.1 గం.కు ఖడ్గం, సా.4 గం.కు మహాత్మ, రా.10 గం.కు మేజర్ *జీ తెలుగు: సా.4 గం.కు సుభాష్ చంద్రబోస్ *జీ సినిమాలు: ఉ.9 గం.కు ఉరీ ది సర్జికల్ స్ట్రైక్స్ *స్టార్ మా మూవీస్: సా.6 గం.కు అమరన్.