News August 15, 2025
టీమిండియా రైజింగ్ స్టార్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇండియన్ క్రికెట్‌లో రైజింగ్ స్టార్ ఎవరో చెప్పారు. ‘నేను శుభ్‌మన్ గిల్‌ని టీమిండియా రైజింగ్ స్టార్‌గా భావిస్తున్నాను. కేవలం 25 ఏళ్లలోనే అతను ఎంతో గుర్తింపు సాధించారు. ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఇంగ్లండ్‌లో అతను ఎలాంటి సిరీస్‌ని ఎదుర్కొన్నారో అంతా చూశాం. అతను చాలా కామ్ అండ్ కంపోజ్డ్. సుదీర్ఘ ఇన్నింగ్సులు ఆడగల సత్తా అతనికి ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News August 15, 2025
BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు TGలో WGL, MDK, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ADB, AFB, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మిగతా జిల్లాల్లో భారీ వానలు పడతాయంది.
News August 15, 2025
రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి

AP: తెల్లవారుజామున రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి HYD వెళ్తుండగా ఘటన జరిగింది. ముందు వెళ్తున్న బస్సును వెనక వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News August 15, 2025
నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

AP: రాష్ట్ర సచివాలయంలో ఇవాళ్టి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించనున్నారు. సచివాలయ ప్రాంగణంలో జూట్ బ్యాగుల స్టాల్‌ని కూడా ప్రారంభించారు. వచ్చే జూన్ 5నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న CM చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు సచివాలయం నుంచే చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి అక్కడ ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, ప్లేట్ల వాడకంపై నిషేధాన్ని అమలు చేయనున్నారు.