News August 15, 2025
GDK: ఈనెల 17న అరుణాచలంకు ప్రత్యేక బస్సు

ఈనెల 17న మ.3 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు గోదావరిఖని RTC డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, విష్ణు కంచి, శివ కంచి, అలంపూర్ జోగులాంబ క్షేత్రాలను దర్శించుకుని తిరిగి 21న బస్సు GDK చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5,600లు, పిల్లలకు రూ.4,400లు.
Similar News
News August 15, 2025
పేదలకు 300 ఎకరాలు ఇచ్చిన మహానీయుడు

స్వాతంత్య్ర పోరాటంలో బాపట్లకు చెందిన రావూరి శ్రీశైలపతికి ప్రత్యేక స్థానం ఉంది. 1886 జనవరి 14న ఆయన జన్మించారు. మురుకుండపాడు కరణంగా పని చేస్తూ, గాంధీ పిలుపుతో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిషు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో 1922లో పదవికి రాజీనామా చేశారు. పర్చూరు మండలం చెరుకూరులో తనకు చెందిన 300 ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారు. యావదాస్తిని స్వాతంత్య్ర పోరాటానికి కేటాయించారు.
News August 15, 2025
ఈనెల 17 నుంచి బిహార్‌లో రాహుల్ యాత్ర

బిహార్‌లో ‘ఓట్ చోరీ’ అంటూ ECపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. పారదర్శక ఓటర్ల జాబితానే లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈనెల 17న ప్రారంభంకానున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో జరిగే మహాసభతో ముగియనుంది. ‘ఓట్ చోరీ’ ఉద్యమాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ మరిన్ని ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
News August 15, 2025
GNT: మాతృమూర్తులే కాదు స్వతంత్ర్యయోధులు

గుంటూరు జిల్లాకు చెందిన ఎందరో మాతృమూర్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో నేనుసైతం అంటూ చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిషు పాలకుల అణిచివేతకు గురై జైలు జీవితం గడిపారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ, గోళ్లమూడి రత్నమ్మ, ఘంటా మల్లికాంబ, భారతి దేవి రంగా, సూర్యదేవర అన్నపూర్ణమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, కొడాలి కమలాంబ, తుమ్మల దుర్గాంబ వంటి మహిళా యోధులు స్వాతంత్రం కోసం పోరాడి మన దేశానికి స్వతంత్ర్యం సాధించారు.