News August 15, 2025
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జనగామలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30కి ధర్మకంచ మినీ స్టేడియంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ పతాకం ఆవిష్కరిస్తారన్నారు. గౌరవ వందనం, మార్చ్ పాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా పురస్కారాలు, స్టాల్స్ పరిశీలనతో వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు.
Similar News
News August 15, 2025
అనకాపల్లి: ‘వైసీపీ ఇసుక కోట కూటమి తుఫాను ధాటికి కూలిపోయింది’

పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గురువారం సోషల్ మీడియాలో స్పందించారు. పులివెందల ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఇన్నాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసుకుని నిర్మించుకున్న వైసీపీ ఇసుక కోట కూటమి తుఫాను ధాటికి కూలిపోయిందన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
News August 15, 2025
భూగర్భ జలాల పెంపునకు సమష్టి కృషి అవసరం: కలెక్టర్

విజయవాడ: జలవనరుల సమర్థ నిర్వహణలో సాగునీటి వినియోగదారుల సంఘాల సహకారం కీలకమని, భూగర్భ జలాల పెంపులోనూ సమష్టి భాగస్వామ్యం ముఖ్యమని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. గురువారం సీఎం చంద్రబాబు వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సాగునీటి వినియోగదారుల సంఘాల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.
News August 15, 2025
విజయవాడలో సీఎం పర్యటన.. పకడ్బందీ ఏర్పాట్లు

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించేందుకు నేడు విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. CP రాజశేఖర్ బాబు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, భద్రతకు సంబంధించిన పలు ఆదేశాలు జారీ చేశారు. CM పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.