News August 15, 2025

నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

image

AP: రాష్ట్ర సచివాలయంలో ఇవాళ్టి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించనున్నారు. సచివాలయ ప్రాంగణంలో జూట్ బ్యాగుల స్టాల్‌ని కూడా ప్రారంభించారు. వచ్చే జూన్ 5నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న CM చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు సచివాలయం నుంచే చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి అక్కడ ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, ప్లేట్ల వాడకంపై నిషేధాన్ని అమలు చేయనున్నారు.

Similar News

News August 15, 2025

‘సుదర్శన చక్ర మిషన్’ ప్రకటించిన ప్రధాని

image

ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్రివిధ దళాల ఆయుధ సంపత్తి పెంచడమే లక్ష్యంగా ‘సుదర్శన చక్ర మిషన్’ను ప్రకటించారు. దీని ద్వారా రానున్న పదేళ్లలో రక్షణ శాఖకు అత్యంత అధునాతన ఆయుధాలు అందిస్తామని చెప్పారు. తద్వారా ఆయన పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు పంపారు.

News August 15, 2025

సెలవులు రద్దు.. రేపటి వరకు జాగ్రత్త

image

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో 24 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ‘3 రోజులు కొన్ని జిల్లాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌‌లో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలి’ అని మంత్రి ఆదేశించారు.

News August 15, 2025

‘PM వికసిత్ భారత్’ పథకాన్ని ప్రకటించిన మోదీ

image

ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా యువత కోసం రూ.లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. తొలిసారి ఉద్యోగం సాధించినవారికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.