News August 15, 2025

BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు TGలో WGL, MDK, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ADB, AFB, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మిగతా జిల్లాల్లో భారీ వానలు పడతాయంది.

Similar News

News August 15, 2025

ఆగస్టు 15.. ఈ దేశాలకూ ప్రత్యేకమే

image

భారతీయులకు ఆగస్టు 15 ఎంతో ప్రత్యేకం. మనతో పాటు మరో 5 దేశాలూ ఇవాళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. 1945లో జపాన్ నుంచి విముక్తి పొందిన సందర్భంగా నార్త్, సౌత్ కొరియా దేశాలు ఇవాళ లిబరేషన్ డే జరుపుకుంటాయి. అలాగే 1971లో బ్రిటిష్ నుంచి బహ్రెయిన్, 1960లో ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 1940లో జర్మన్ కాన్ఫెడరేషన్ నుంచి లిక్‌టన్‌స్టైన్ స్వాతంత్ర్యం పొందాయి.

News August 15, 2025

22 నుంచి సివిల్స్ మెయిన్ పరీక్షలు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఈనెల 22 నుంచి దేశవ్యాప్తంగా జరగనున్నాయి. 22, 23, 24, 30, 31వ తేదీల్లో జరిగే పరీక్షలను తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లోనే నిర్వహించనున్నారు. 979 పోస్టుల భర్తీకి మే 25న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 5 లక్షల మంది హాజరయ్యారు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను వెబ్‌సైటులో నిన్నటి నుంచి అందుబాటులో ఉంచారు. అడ్మిట్ కార్డుల కోసం <>క్లిక్ <<>>చేయండి.

News August 15, 2025

‘కూలీ’కి తొలిరోజు భారీ కలెక్షన్స్!

image

సూపర్‌స్టార్ రజినీకాంత్‌, లోకేశ్ కాంబోలో నిన్న రిలీజైన ‘కూలీ’ తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు ₹140Cr(గ్రాస్) వసూలు చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ Sacnik తెలిపింది. తమిళ్‌లో ₹28Crతో హయ్యెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ బ్రేక్ చేసినట్లు పేర్కొంది. తెలుగులో ₹18Cr, కన్నడలో ₹15Cr, మలయాళంలో ₹10Cr, హిందీలో ₹8Cr వచ్చాయంది. ఓవరాల్‌గా INDలో ₹65Cr, ఓవర్సీస్‌లో ₹75Cr కలెక్ట్ చేసిందని తెలిపింది.