News August 15, 2025

వరంగల్: ‘స్వేచ్ఛ’ కోసం రూ.12 వేలు..!

image

స్వతంత్రోద్యమంలో వరంగల్ జిల్లాకు సైతం ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 1945 ఫిబ్రవరి 5న మహాత్మా గాంధీ వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారీ స్థాయిలో వచ్చిన ప్రజలు ఆనాడు స్వతంత్ర ఉద్యమానికి అక్కడికక్కడే దాదాపు రూ.12 వేలు సమీకరించి ఉద్యమానికి నిధిగా గాంధీజీకి అందించారు. గాంధీజీ రాక గుర్తుగా ఎలాంటి స్మృతులు లేకపోవడం బాధాకరమని స్థానికులు చెబుతారు.

Similar News

News August 15, 2025

కడపలో జెండా ఎగురవేసిన మంత్రి ఫరూక్

image

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కడప నగరంలో నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మంత్రి ఫరూక్ హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై తన సందేశంలో ప్రజలకు వినిపించారు.

News August 15, 2025

జాతీయ జెండా ఎగరవేసిన వరంగల్ కలెక్టర్

image

79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ డాక్టర్ సత్య శారద శుక్రవారం జాతీయ పతాకావిష్కరణ చేశారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు కలెక్టర్ స్వతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.

News August 15, 2025

కేయూలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

image

కాకతీయ విశ్వవిద్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రతాప రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో గతేడాది నిర్వహించిన కార్యక్రమాలు, రానున్న రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. రానున్న పోటీ తరానికి ధీటుగా యూజీ, పీజీ విద్యార్థుల సిలబస్‌ను మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు.