News August 15, 2025
GNT: మాతృమూర్తులే కాదు స్వతంత్ర్యయోధులు

గుంటూరు జిల్లాకు చెందిన ఎందరో మాతృమూర్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో నేనుసైతం అంటూ చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిషు పాలకుల అణిచివేతకు గురై జైలు జీవితం గడిపారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ, గోళ్లమూడి రత్నమ్మ, ఘంటా మల్లికాంబ, భారతి దేవి రంగా, సూర్యదేవర అన్నపూర్ణమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, కొడాలి కమలాంబ, తుమ్మల దుర్గాంబ వంటి మహిళా యోధులు స్వాతంత్రం కోసం పోరాడి మన దేశానికి స్వతంత్ర్యం సాధించారు.
Similar News
News August 15, 2025
తెనాలి: స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఆదరణ కరవు

తెనాలికి చెందిన అడిగోపుల నరసింహారావు, బాలత్రిపుర సుందరి దంపతులు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా పోరాటంలో జైలుకు కూడా వెళ్లారు. స్వాతంత్ర్య సంగ్రామం అనంతరం వీరి త్యాగాలను గుర్తిస్తూ ప్రభుత్వం తామ్ర పత్రాలను ఇచ్చి గౌరవించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆదరణలేక సాయం అందక వీరి కుమారుడు ఉమామహేశ్వరరావు దారం తయారీ కంపెనీలో కూలీగా పనిచేస్తూ అద్దె ఇంట్లో భారంగా కాలం వెలదీస్తున్నారు.
News August 15, 2025
మంగళగిరిని అమరావతి జిల్లాలో కలిపే నిర్ణయం సరైనదేనా?

ప్రభుత్వం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్న విషయం విధితమే. అమరావతి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అమరావతి జిల్లాలో తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ, పెదకూరపాడు నియోజకవర్గాలు ఉంటాయని ప్రచారం. మంగళగిరి నియోజకవర్గంని అమరావతి జిల్లాలో కలపడం మంగళగిరి అభివృద్ధికి లాభమా నష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు.
News August 15, 2025
‘గుంటూరు కేసరి’ నడింపల్లి లక్ష్మీనరసింహారావు పంతులు

స్వాతంత్రోద్యమ కాలంలో ‘గుంటూరు కేసరి’గా నడింపల్లి లక్ష్మీనరసింహారావు పంతులు (1890-1978) పిలవబడ్డారు. టంగుటూరి ప్రకాశం వద్ద శిష్యుడిగా పనిచేసి, కోస్తాంధ్ర ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వ్యక్తి. స్వాతంత్రానికి ముందు 11 సంవత్సరాలు గుంటూరు పురపాలక ఛైర్మన్గా, 1953లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా చేశారు. గాంధీ పార్క్ నిర్మాణం ఈయన హయాంలోనే జరిగింది. హిమని కూడలి వద్ద ఈయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.