News August 15, 2025

ఈనెల 17 నుంచి బిహార్‌లో రాహుల్ యాత్ర

image

బిహార్‌లో ‘ఓట్ చోరీ’ అంటూ ECపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. పారదర్శక ఓటర్ల జాబితానే లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈనెల 17న ప్రారంభంకానున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1న బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో జరిగే మహాసభతో ముగియనుంది. ‘ఓట్ చోరీ’ ఉద్యమాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ మరిన్ని ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

Similar News

News August 15, 2025

వరదను భరించాలి కానీ ఆ నీరు వాడుకోవద్దా: చంద్రబాబు

image

AP: విజయవాడలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్ల ప్రాజెక్టుపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు. ఎవరూ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తున్నాం. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నాం. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఏంటి? వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా?’ అని ప్రశ్నించారు.

News August 15, 2025

సుప్రీం తీర్పు.. రీకౌంటింగ్‌తో మారిన ఫలితం

image

హరియాణాలోని పానిపట్(D) బానాలాఖూలో 3 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల ఫలితం మారింది. 2022 NOVలో వచ్చిన ఫలితాల్లో కుల్దీప్ గెలవగా కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని మోహిత్ కోర్టుల్లో పోరాడారు. ఒక్క బూత్‌లో లెక్కించేందుకే జిల్లా కోర్టు అనుమతించగా దాన్ని SCలో సవాల్ చేశారు. దీంతో అన్ని బూత్‌లలో రీకౌంట్‌కు ఆదేశాలొచ్చాయి. రీకౌంటింగ్‌లో మోహిత్ 1,051, కుల్దీప్ 1000 ఓట్లు సాధించడంతో పిటిషనర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

News August 15, 2025

ఆగస్టు 15.. ఈ దేశాలకూ ప్రత్యేకమే

image

భారతీయులకు ఆగస్టు 15 ఎంతో ప్రత్యేకం. మనతో పాటు మరో 5 దేశాలూ ఇవాళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. 1945లో జపాన్ నుంచి విముక్తి పొందిన సందర్భంగా నార్త్, సౌత్ కొరియా దేశాలు ఇవాళ లిబరేషన్ డే జరుపుకుంటాయి. అలాగే 1971లో బ్రిటిష్ నుంచి బహ్రెయిన్, 1960లో ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 1940లో జర్మన్ కాన్ఫెడరేషన్ నుంచి లిక్‌టన్‌స్టైన్ స్వాతంత్ర్యం పొందాయి.