News August 15, 2025

అనకాపల్లి: ‘వైసీపీ ఇసుక కోట కూటమి తుఫాను ధాటికి కూలిపోయింది’

image

పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గురువారం సోషల్ మీడియాలో స్పందించారు. పులివెందల ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఇన్నాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసుకుని నిర్మించుకున్న వైసీపీ ఇసుక కోట కూటమి తుఫాను ధాటికి కూలిపోయిందన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News August 15, 2025

CM గ్రీన్ సిగ్నల్.. వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ!

image

7 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది. 20నెలలుగా పోస్టుల భర్తీ కాకపోవడంతో నిరుత్సాహంలో ఉన్న క్యాడర్లో CM గ్రీన్ సిగ్నల్‌తో ఆశలు చిగురించాయి. ఉమ్మడి KNRలో 7 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. ఇటీవల నియోజకవర్గానికి 2 పేర్ల చొప్పున KNR CONG ఇన్ఛార్జ్ అద్దంకి దయాకర్ అధిష్ఠానానికి నివేదించారు. అయితే KNR నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకపోవడంతో పేర్లు పంపారా? లేదా? అనే అయోమయం నెలకొంది.

News August 15, 2025

విశాఖ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

విశాఖలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్న సత్యరాజ్ బైక్ పై మిత్రుడితో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వేములవలస వద్ద అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సాయికుమార్ రోడ్డు దాటుతుండగా మినీ బస్సు ఢీకొని మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 15, 2025

వరదను భరించాలి కానీ ఆ నీరు వాడుకోవద్దా: చంద్రబాబు

image

AP: విజయవాడలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్ల ప్రాజెక్టుపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు. ఎవరూ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తున్నాం. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నాం. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఏంటి? వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా?’ అని ప్రశ్నించారు.