News August 15, 2025

అమల్లోకి రూ.3000 యాన్యువల్ పాస్

image

దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి రూ.3,000 ఫాస్టాగ్ పాస్ అమల్లోకి వచ్చింది. నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ పాస్ తీసుకుంటే ఫాస్టాగ్‌ను పదేపదే రీఛార్జ్ చేయించాల్సిన అవసరం లేదు. ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు ఈ పాస్‌తో ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి <<17380892>>క్లిక్ <<>>చేయండి.

Similar News

News August 15, 2025

రాష్ట్రంలో ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

image

AP: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో ఇల్లాలు. శ్రీకాకుళం(D) పాతపట్నంకు చెందిన నల్లి రాజు, మౌనికకు వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల ఆమెకు ఉదయ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. అతడి భోజనంలో నిద్రమాత్రలు కలిపి, ప్రియుడితో పాటు మరొకరితో కలిసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. పోలీసుల దర్యాప్తులో విషయం బయటపడింది.

News August 15, 2025

కృష్ణా, గోదావరి నదుల్లో వాటా సాధిస్తాం: రేవంత్

image

TG: కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర వాటాను సాధించి తీరుతామని CM రేవంత్ పునరుద్ఘాటించారు. ‘ఒత్తిడికి లొంగేది లేదు. మన ప్రాంతానికి సాగునీరు అందిస్తాం. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. కానీ గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కూలి గోదావరిలో కలిసింది. సెంటిమెంట్ల పేరిట చేస్తున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలి’ అని వ్యాఖ్యానించారు.

News August 15, 2025

క్షమాపణలు చెప్పిన మృణాల్ ఠాకూర్

image

సారీ చెబుతూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. గతంలో ఆమె బిపాషా బసుపై చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ వీడియో ఇటీవల వైరల్ అయింది. వాటిపై <<17400036>>బిపాషా<<>> కూడా స్పందించారు. దీంతో ఆమె పేరు చెప్పకుండా మృణాల్ క్షమాపణలు కోరారు. ‘19 ఏళ్ల వయసులో నేను ఎన్నో సిల్లీ విషయాలు మాట్లాడాను. అవి ఇతరులను బాధపెట్టాయని అర్థమైంది. ఎవరినీ బాడీషేమింగ్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ తప్పు జరిగింది’ అని రాసుకొచ్చారు.