News August 15, 2025
ఉప్పు అనుకుని చీమల మందు కలిపారు.. వెలుగులోకి కార్మికుల నిర్వాకం

నర్సీపట్నం జడ్పీ హైస్కూల్ (మెయిన్) మిడ్ డే మీల్స్ కార్మికుల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం పిల్లలకు పెట్టే మధ్యాహ్నం భోజనంలో ఉప్పు అనుకుని చీమల ముందు కలిపేశారు. తర్వాత ఆహారం వాసన రావడంతో సిబ్బంది నాలుక కరుచుకున్నారు. వెంటనే భోజనాన్ని బయట పారబోసి తిరిగి విద్యార్థుల కోసం వండారు. విషయం బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది.
Similar News
News August 15, 2025
స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి: CP

విజయవాడ: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ రాజశేఖర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలితమే ఈ స్వాతంత్ర్యమని, దాని ఫలాన్ని భారతీయులందరూ ఆనందంగా అనుభవిస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరూ దేశ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
News August 15, 2025
సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

PDPL జిల్లాలో విద్యా, వైద్య శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమయానికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పీఎం శ్రీ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, శాతవాహన యూనివర్సిటీ అడ్మిన్ బ్లాక్, బాలల సదనం పనులు, ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాల నిర్మాణాలు ఆలస్యం కాకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.
News August 15, 2025
కృష్ణా: ఫ్రీ బస్సు.. మహిళలు అధిపత్యం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 13 ఆర్టీసీ బస్సు డిపోలలో 1,216 బస్సులు నడుస్తున్నాయి. ప్రతి రోజుకు సగటున 2,30,200 మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నారు. అందులో 1.08 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తుండగా నెలకు 32.4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రయాణికుల్లో పురుషులు 60%, మహిళలు 40% ఉండగా, ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మహిళల శాతం 67%కు పెరగనుంది.