News August 15, 2025

HYD: శ్రీకాంతా.. నీ అమరత్వం మరువం!

image

ఓ వైపు శరీరాన్ని మంటలు దహించివేస్తోన్న ఆ ఉద్యమకారుడి గొంతులో తెలంగాణ నినాదం ఆగలేదు. స్వరాష్ట్రం కోసం 2009 NOV 29న LBనగర్‌ చౌరస్తాలో శ్రీకాంతా చారి ఆత్మహుతితో ఉమ్మడి రాష్ట్రం ఉలిక్కిపడింది. గురిచేసింది. జనం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ‘జై తెలంగాణ’ అంటూ 5 రోజులు మృత్యువుతో పోరాడాడు. స్వరాష్ట్రం కోసం పరితపించి, ప్రాణాలు విడిచిన శ్రీకాంతాచారి జయంతి నేడు.
అమరుడా నీకు జోహర్లు.

Similar News

News August 15, 2025

స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి: CP

image

విజయవాడ: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ రాజశేఖర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలితమే ఈ స్వాతంత్ర్యమని, దాని ఫలాన్ని భారతీయులందరూ ఆనందంగా అనుభవిస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరూ దేశ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

News August 15, 2025

సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

PDPL జిల్లాలో విద్యా, వైద్య శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమయానికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పీఎం శ్రీ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, శాతవాహన యూనివర్సిటీ అడ్మిన్ బ్లాక్, బాలల సదనం పనులు, ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాల నిర్మాణాలు ఆలస్యం కాకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.

News August 15, 2025

కృష్ణా: ఫ్రీ బస్సు.. మహిళలు అధిపత్యం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 13 ఆర్టీసీ బస్సు డిపోలలో 1,216 బస్సులు నడుస్తున్నాయి. ప్రతి రోజుకు సగటున 2,30,200 మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నారు. అందులో 1.08 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తుండగా నెలకు 32.4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రయాణికుల్లో పురుషులు 60%, మహిళలు 40% ఉండగా, ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మహిళల శాతం 67%కు పెరగనుంది.