News August 15, 2025
‘PM వికసిత్ భారత్’ పథకాన్ని ప్రకటించిన మోదీ

ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా యువత కోసం రూ.లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. తొలిసారి ఉద్యోగం సాధించినవారికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Similar News
News August 15, 2025
శిథిలాల కింద 500 మంది ఉండొచ్చు: ఫరూక్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్ కిష్త్వార్‌లో భారీ వరదల వల్ల 60మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే, శిథిలాల కింద 500 మంది వరకు చిక్కుకొని ఉంటారని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అయితే ఆ సంఖ్య వెయ్యికి పైగా ఉంటుందని పలువురు అధికారులు చెబుతున్నట్లు వివరించారు. ఇదో విషాదకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News August 15, 2025
స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎప్పుడొస్తాయో?

మన దేశంలో విదేశాలకు చెందిన వాట్సాప్, యూట్యూబ్, ట్విటర్ (X), ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లదే హవా. అయితే మన యువత స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను రూపొందించాలని ప్రధాని మోదీ ఇవాళ పిలుపునిచ్చారు. గతంలో హైక్, చింగారి, కూ, మోజ్, రొపొసొ లాంటివి వచ్చినా ఎక్కువ రోజులు నిలబడలేకపోయాయి. యాప్ డిజైనింగ్‌లో లోపాలు, యూఐ లాంటి సమస్యలతో యూజర్లు వాటిని ఆదరించట్లేదు.
News August 15, 2025
OFFICIAL.. ‘కూలీ’కి భారీ కలెక్షన్స్

సూపర్‌స్టార్ రజినీకాంత్, లోకేశ్ కాంబోలో నిన్న రిలీజైన ‘కూలీ’ తొలిరోజు రూ.151 కోట్ల+ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక తమిళ సినిమాకు తొలిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పేర్కొంది. సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డులు సృష్టిస్తారని, తిరిగి వాటిని బద్దలు కొడతారని ఓ పోస్టర్‌ను పంచుకుంది. వరుసగా సెలవులు ఉండటంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్సుంది.