News August 15, 2025

కలెక్టరేట్లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

image

నెల్లూరులోని కలెక్టరేట్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కలెక్టరేట్లో ఉన్న గాంధీజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ పూలమాలలు వేసి, 100 అడుగుల స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో జిల్లా ప్రజలకి మెరుగైన పాలన అందించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 7, 2025

నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?

News November 7, 2025

నెల్లూరు: లోకేష్ వార్నింగ్ ఎవరికో..?

image

దగదర్తిలో నారా లోకేశ్ ఇచ్చిన వార్నింగ్ కలకలం రేపుతోంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరుస్తూ పోస్టులు పెట్టడాన్ని గమనించాం. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.. యాక్షన్‌లో చూపిస్తాం’ అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారనేది టీడీపీలో కాక రేపుతోంది.

News November 6, 2025

రేపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రాక

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు నెల్లూరు VRC మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక లక్ష దీపోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు డీఆర్సీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4.15 గంటలకు కొండ బిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని మంత్రి దర్శించుకుంటారు.