News August 15, 2025
చిత్తూరు: జాతీయ పతాకం ఆవిష్కరించిన మంత్రి

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చిత్తూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా వందనం స్వీకరించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పేరెడ్‌ను తిలకించారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ విద్యాధరి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 16, 2025
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి: జడ్పీ ఛైర్మన్

చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు అన్నారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలతో ఇంజినీరింగ్ పనుల బకాయి బిల్లులు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని జేసీ విద్యాధరి అన్నారు. అన్నదాత సుఖీభవ అందని రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News August 16, 2025
చిత్తూరు జిల్లా టీచర్ల గమనిక

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2025కు అర్హులైన హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఈనెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి ఓ ప్రకటనలో కోరారు. 10 ఏళ్ల సర్వీసు ఉన్నవారు అర్హులన్నారు. ప్రతిపాదనలు రెండు కాపీలను ఉపవిద్యా శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన ప్రతిపాదనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
News August 16, 2025
కాణిపాకంలో ఫ్రీ బస్ ప్రారంభం

కాణిపాకంలో ఫ్రీ బస్ పథకాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. మహిళల జీవన విధానంలో ఉచిత బస్సు ప్రయాణం విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సూపర్-6 పథకాల సాకారానికి సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.