News August 15, 2025

గోల్కొండ‌లో పంద్రాగస్టు వేడుకలు.. CM రాకతో బందోబస్తు

image

పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా గోల్కొండ కోట ముస్తాబైంది. ఉదయం 10 గంటలకు CM రేవంత్ రెడ్డి జెండా ఎగరేయనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచే రాందేవ్‌గూడ-గోల్కొండ కోట రూట్‌లో వాహనాలను అనుమతించడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరికాసేపట్లో CM కోటకు చేరుకోనున్నారు.

Similar News

News August 15, 2025

HYD: మరో 13 చెరువుల అభివృద్ధికి హైడ్రా ప్రణాళిక.!

image

సిటీలో హైడ్రా 6 చెరువుల అభివృద్ధిని చేప‌ట్టింది. అంబ‌ర్‌పేట‌ బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధ‌రించి, అక్క‌డ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని సృష్టించింది. కేంద్ర బృందాలు ప‌లుమార్లు సంద‌ర్శించి అక్క‌డ హైడ్రా చ‌ర్య‌లను అభినందించాయి. మ‌రో 13 చెరువుల అభివృద్ధికి ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది.

News August 15, 2025

HYD: పోలీసులకు గుడ్‌న్యూస్

image

గ్రాడ్యుయేషన్ లేని పోలీసులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. SSC, ఇంటర్ పూర్తిచేసిన కానిస్టేబుళ్లు డిగ్రీ చేయవచ్చు. ఈ మేరకు ఓపెన్ యూనివర్సిటీతో పోలీసు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. 40 సంవత్సరాలలోపు ఉన్న కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు ఈ ఛాన్స్ కల్పిస్తున్నారు. తమకు ఇష్టమైన సబ్జెక్టులలో డిగ్రీ చేయవచ్చు. దాదాపు 120 సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి.

News August 15, 2025

HYD: హైడ్రాపై దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టండి: రంగనాథ్

image

హైడ్రాపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కమిషనర్ రంగనాథ్ ఖండించారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రాకు అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యంగా తమ కృషి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.