News August 15, 2025

22 నుంచి సివిల్స్ మెయిన్ పరీక్షలు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఈనెల 22 నుంచి దేశవ్యాప్తంగా జరగనున్నాయి. 22, 23, 24, 30, 31వ తేదీల్లో జరిగే పరీక్షలను తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లోనే నిర్వహించనున్నారు. 979 పోస్టుల భర్తీకి మే 25న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 5 లక్షల మంది హాజరయ్యారు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను వెబ్‌సైటులో నిన్నటి నుంచి అందుబాటులో ఉంచారు. అడ్మిట్ కార్డుల కోసం <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News August 15, 2025

తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుంది: రేవంత్

image

TG: త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘RRR, రీజినల్ రింగ్ రైల్వే లైన్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇవి వస్తే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. వెయ్యేళ్లు ప్రజలు చెప్పుకునేలా మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ ఉంటాయి. యావత్ దేశం చూపు TG వైపు ఉండేలా చేస్తాం’ అని HYDలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో CM అన్నారు.

News August 15, 2025

SALUTE రాజు నాయక్..

image

TG: అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ రాజు నాయక్‌కు కేంద్రం శౌర్య పతకం ప్రకటించింది. 2023లో నార్సింగి ORR సమీపంలో దంపతులను హత్య చేసి పరారైన కరణ్‌ను ఆయన గాలించి పట్టుకున్నారు. ఆ టైంలో తన ఛాతీ, తలపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. రక్తం కారుతున్నా రాజు అతణ్ని వదల్లేదు. తోటి పోలీసుల సాయంతో అరెస్ట్ చేశారు. 3 సర్జరీల తర్వాత కోలుకుని ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

News August 15, 2025

త్రివిక్రమ్, వెంకటేశ్ కాంబోలో కొత్త మూవీ

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో కొత్త మూవీ ఫిక్స్ అయింది. ‘వెంకీ77’ వర్కింగ్ టైటిల్‌తో త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వెంకటేశ్ Xలో వెల్లడించారు. ఇది చాలా స్పెషల్ అంటూ త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. వీరిద్దరి కాంబోలో ఇదే తొలి మూవీ కావడం విశేషం. ప్రొడ్యూసర్స్ నాగవంశీ, రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు.