News August 15, 2025
కరప: ఉప్పు సత్యాగ్రహానికి బీజం ఇక్కడే.!

కరప(మ)గురజనాపల్లి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిగా నిలిచింది. జాతిపిత గాంధీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించిన చోటు ఇదే. గాంధీ ఇక్కడికి వచ్చి ఉప్పు తీసుకుని వెళ్లారని పెద్దలు చెబుతున్నారు. ఈ ప్రాంతం నేటి రోజుల్లో కూడా ఉప్పు పంట పండిస్తుంది.79 ఏళ్లు గడిచినా,ఉప్పు పంట స్వాతంత్ర్య కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తుంది. గ్రామస్థులందరి గౌరవం స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలు సమాజంలో స్మరణీయంగా నిలుస్తున్నాయి.
Similar News
News August 15, 2025
తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుంది: రేవంత్

TG: త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘RRR, రీజినల్ రింగ్ రైల్వే లైన్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇవి వస్తే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. వెయ్యేళ్లు ప్రజలు చెప్పుకునేలా మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ ఉంటాయి. యావత్ దేశం చూపు TG వైపు ఉండేలా చేస్తాం’ అని HYDలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో CM అన్నారు.
News August 15, 2025
క్లాక్ టవర్ ప్రత్యేక ఇదీ!

అనంతపురంలోని క్లాక్ టవర్ రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. క్లాక్ టవర్ వెడల్పు 15 అడుగులు కాగా 15వ తేదీని సూచిస్తుందని అన్నారు. టవర్‌కు 8 ముఖాలు ఉండగా 8వ నెల అంటే ఆగస్టును, క్లాక్ టవర్ ఎత్తు 47 అడుగులు కాగా ఇది 1947 సంవత్సరాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం అప్పటి జిల్లా కలెక్టర్ రాజనాల కోటేశ్వరరావు పర్యవేక్షణలో ప్రజల విరాళాలతో జరిగిందని చెప్పారు.
News August 15, 2025
సూర్యాపేట: జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.