News August 15, 2025

అనకాపల్లి: జాతీయ పతాకాన్ని ఎగురవేసిన హోం మంత్రి

image

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఎస్పీ తుహీన్ సిన్హా, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 15, 2025

తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుంది: రేవంత్

image

TG: త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘RRR, రీజినల్ రింగ్ రైల్వే లైన్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇవి వస్తే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. వెయ్యేళ్లు ప్రజలు చెప్పుకునేలా మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ ఉంటాయి. యావత్ దేశం చూపు TG వైపు ఉండేలా చేస్తాం’ అని HYDలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో CM అన్నారు.

News August 15, 2025

క్లాక్ టవర్ ప్రత్యేక ఇదీ!

image

అనంతపురంలోని క్లాక్ టవర్ రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. క్లాక్ టవర్ వెడల్పు 15 అడుగులు కాగా 15వ తేదీని సూచిస్తుందని అన్నారు. టవర్‌కు 8 ముఖాలు ఉండగా 8వ నెల అంటే ఆగస్టును, క్లాక్ టవర్ ఎత్తు 47 అడుగులు కాగా ఇది 1947 సంవత్సరాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం అప్పటి జిల్లా కలెక్టర్ రాజనాల కోటేశ్వరరావు పర్యవేక్షణలో ప్రజల విరాళాలతో జరిగిందని చెప్పారు.

News August 15, 2025

సూర్యాపేట: జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.