News August 15, 2025
KNR: గ్రామాల్లో మళ్లీ VRO, VRAల వ్యవస్థ!

గ్రామపాలన అధికారులు(GPO)గా VRO, VRAలు మళ్లీ విధుల్లో చేరనున్నారు. వీరికి నిన్ననే నియామకపత్రాలు అందాల్సి ఉండగా వర్షాలతో కుదర్లేదు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలంటే VRO, VRAల అవసరం తప్పనిసరని గుర్తించిన ప్రభుత్వం వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగించాలని నిర్ణయించింది. అయితే ఉమ్మడి KNRలో విధుల్లో చేరడానికి 2800మంది సుముఖత చూపగా KNR నుంచి 540మంది VRAలు, 300మంది VROలు కంబ్యాక్ అయ్యారు.
Similar News
News August 15, 2025
ASF: ప్రశంస పత్రాలను అందజేస్తున్న ఎస్పీ

జిల్లా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తించిన పోలీసు అధికారులకు సేవ పథకాలను 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అందజేశారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, జిల్లాలోని సీఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News August 15, 2025
HYD: జాతీయ జెండా ఆవిష్కరించిన మేయర్ విజయలక్ష్మి

ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేయర్ మాట్లాడుతూ.. మన అందరి నినాదం జాతీయత అయి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
News August 15, 2025
పుట్టపర్తిలో జెండా ఎగురవేసిన మంత్రి

పుట్టపర్తిలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రిని కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ చూపిన అధికారులకు అవార్డులు అందజేశారు.