News August 15, 2025
విశాఖలో వెలిగిన స్వాతంత్ర్య దీపం.. తెన్నేటి విశ్వనాథం

స్వాతంత్ర్య ఉద్యమంలో జ్యోతి తెన్నేటి విశ్వనాథం కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి సత్యాగ్రహంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యారు. విశాఖ ఎంపీగాను గెలుపొందారు. మద్రాస్ ప్రెసెడెన్సీ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటులో ఆయన కృషి నగర వాసులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Similar News
News August 15, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న DMHO పేడాడ జగదీశ్వర్రావు

విశాఖ జిల్లా DMHO పేడాడ జగదీశ్వర్రావు ఉత్తమ అవార్డును రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ అందించిన అవార్డుల్లో DMHO పేడాడ జగదీశ్వర్రావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది DMHOకు అభినందనలు తెలిపారు.
News August 15, 2025
విశాఖ కలెక్టరేట్లో జెండా ఎగరవేసిన కలెక్టర్

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయనతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సందేశాన్ని అందించారు. వేడుకల్లో భాగంగా సిబ్బందికి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.
News August 15, 2025
73 లక్షల మందికి సేవలు: పృథ్వీతేజ్

విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఛైర్మన్ పృథ్వితేజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ పరిధిలో 73 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. 19,385 మంది వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు అమర్చామన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 97 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.