News August 15, 2025

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

image

79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపనలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.

Similar News

News August 15, 2025

MBNR: పోలీసు పరేడ్ మైదానంలో.. స్వాతంత్ర్య వేడుకలు

image

MBNRలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలను తిలకించారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

News August 15, 2025

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.

News August 15, 2025

MBNR:ASI మొయిజుద్దీన్.. రివార్డ్స్ ఇవే!

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ మొయిజుద్దీన్ ఇండియా పోలీస్ మెడల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఇప్పటివరకు 70 కాష్ రివార్డులు, 18 GSEలు, 12 ప్రశంస పత్రాలు, 1 సేవా పతకం(2013), తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం(2017), ఉత్తక పోలీస్ పతకం(2019) అందుకున్నారు. భారత ప్రభుత్వం ఇండియా పోలీస్ మెడల్ ప్రకటించడంతో పలువురు అభినందిస్తూ.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.