News August 15, 2025

HYD: పోలీసులకు గుడ్‌న్యూస్

image

గ్రాడ్యుయేషన్ లేని పోలీసులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. SSC, ఇంటర్ పూర్తిచేసిన కానిస్టేబుళ్లు డిగ్రీ చేయవచ్చు. ఈ మేరకు ఓపెన్ యూనివర్సిటీతో పోలీసు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. 40 సంవత్సరాలలోపు ఉన్న కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు ఈ ఛాన్స్ కల్పిస్తున్నారు. తమకు ఇష్టమైన సబ్జెక్టులలో డిగ్రీ చేయవచ్చు. దాదాపు 120 సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి.

Similar News

News August 15, 2025

ఎల్బీనగర్‌‌లో శ్రీకాంతాచారికి నివాళులు

image

తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా ఈరోజు HYD ఎల్బీనగర్‌ చౌరస్తా సమీపంలోని ఆయన విగ్రహానికి BRS నేతలు ఘనంగా నివాళులర్పించారు. MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఉద్యమ వీరుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

News August 15, 2025

సైబరాబాద్ కమిషనరేట్‌ ఆఫీస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈరోజు గచ్చిబౌలి పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది గొప్ప వ్యక్తులు చేసిన అపారమైన త్యాగాలను ఆయన కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు.

News August 15, 2025

HYD: జలమండలి ఆఫీస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

image

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎండీ అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వినియోగదారులు, ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్, డైరెక్టర్లు సుదర్శన్, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.