News August 15, 2025

విశాఖలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

image

విశాఖ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి అనగాని సత్య ప్రసాద్ జాతీయ జెండా ఎగురువేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, కమిషనర్ శంఖబ్రత బాగ్చి, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్ పాల్గొన్నారు. పోలీస్, రెవెన్యూ, జీవీఎంసీ విభాగాల్లో ప్రతిభ చూపించిన అధికారులు, ఉద్యోగులకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

Similar News

News August 15, 2025

విశాఖలో గృహనిర్మాణశాఖ శకటానికి ప్రథమ బహుమతి

image

విశాఖలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖకు ప్రథమ స్థానం, జీవీఎంసీ శకటానికి ద్వితీయ స్థానం, విద్యాశాఖ శకటానికి తృతీయ స్థానం లభించింది. మరికొన్ని ప్రభుత్వ శకటాలు కూడా ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

News August 15, 2025

ఉత్తమ అవార్డు అందుకున్న DMHO పేడాడ జగదీశ్వర్రావు

image

విశాఖ జిల్లా DMHO పేడాడ జగదీశ్వర్రావు ఉత్తమ అవార్డును రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ అందించిన అవార్డుల్లో DMHO పేడాడ జగదీశ్వర్రావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది DMHOకు అభినందనలు తెలిపారు.

News August 15, 2025

విశాఖ కలెక్టరేట్లో జెండా ఎగరవేసిన కలెక్టర్

image

విశాఖ క‌లెక్ట‌రేట్లో శుక్ర‌వారం 79వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడులు ఘ‌నంగా జరిగాయి. క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయ‌న‌తో పాటు వీఎంఆర్డీఏ క‌మిష‌న‌ర్ కె.ఎస్. విశ్వ‌నాథ‌న్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ జాతీయ ప‌తాకానికి గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించారు. అనంత‌రం సందేశాన్ని అందించారు. వేడుక‌ల్లో భాగంగా సిబ్బందికి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.