News August 15, 2025
SALUTE రాజు నాయక్..

TG: అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ రాజు నాయక్‌కు కేంద్రం శౌర్య పతకం ప్రకటించింది. 2023లో నార్సింగి ORR సమీపంలో దంపతులను హత్య చేసి పరారైన కరణ్‌ను ఆయన గాలించి పట్టుకున్నారు. ఆ టైంలో తన ఛాతీ, తలపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. రక్తం కారుతున్నా రాజు అతణ్ని వదల్లేదు. తోటి పోలీసుల సాయంతో అరెస్ట్ చేశారు. 3 సర్జరీల తర్వాత కోలుకుని ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News August 15, 2025
‘సూపర్ సిక్స్’ హామీలు సూపర్ హిట్: సీఎం చంద్రబాబు

AP: ‘సూపర్ సిక్స్’ హామీలు సూపర్ హిట్ అయ్యాయని CM చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభోత్సవంలో తెలిపారు. ‘RTC కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకుంది మేమే. త్వరలోనే వారికి డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తాం. 11,449 బస్సుల్లో 8,450 బస్సులను ఈ స్కీమ్‌కు కేటాయించాం. మహిళలు ఫ్రీగా పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
News August 15, 2025
ట్రెండింగ్: #BoycottIndependenceDay

దేశంలో మగవాళ్లకు రక్షణ లేకుండా పోతోందని పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Xలో #BoycottIndependenceDayAug15 అనే హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుత చట్టాలు ఆడవాళ్లవైపే ఉన్నాయని, వాటిని మార్చాల్సిన సమయం వచ్చిందంటున్నారు. భార్య మోసం చేసినా, విడాకులు తీసుకున్నా తామెందుకు పరిహారం చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల భర్తలను చంపుతున్న ఘటనలూ పెరుగుతున్నాయంటున్నారు. మీ COMMENT.
News August 15, 2025
బుమ్రాను ముఖ్యమైన మ్యాచుల్లోనే ఆడించాలి: భువనేశ్వర్

వర్క్‌లోడ్ విషయంలో బుమ్రాకు భువనేశ్వర్ మద్దతుగా నిలిచారు. ENGతో 5 టెస్టుల సిరీస్‌లో బుమ్రా మూడింట్లో మాత్రమే ఆడటంతో అతని పట్ల BCCI పక్షపాతం చూపిస్తోందన్న విమర్శలొచ్చాయి. దీనిపై భువి స్పందిస్తూ ‘ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో ఆడుతూ ఫిట్‌గా ఉండటం కష్టం. అతడు ఏం చేయగలడో సెలక్టర్లకు తెలుసు. బుమ్రా ఎక్కువ కాలం ఆడాలని కోరుకుంటే అతడిని IMP మ్యాచుల్లోనే ఆడించాలి’ అని అభిప్రాయపడ్డారు.