News August 15, 2025
HYD: మరో 13 చెరువుల అభివృద్ధికి హైడ్రా ప్రణాళిక.!

సిటీలో హైడ్రా 6 చెరువుల అభివృద్ధిని చేపట్టింది. అంబర్‌పేట బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, అక్కడ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. కేంద్ర బృందాలు పలుమార్లు సందర్శించి అక్కడ హైడ్రా చర్యలను అభినందించాయి. మరో 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది.
Similar News
News August 15, 2025
ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారికి నివాళులు

తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా ఈరోజు HYD ఎల్బీనగర్ చౌరస్తా సమీపంలోని ఆయన విగ్రహానికి BRS నేతలు ఘనంగా నివాళులర్పించారు. MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఉద్యమ వీరుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
News August 15, 2025
సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈరోజు గచ్చిబౌలి పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది గొప్ప వ్యక్తులు చేసిన అపారమైన త్యాగాలను ఆయన కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు.
News August 15, 2025
HYD: జలమండలి ఆఫీస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఎండీ అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వినియోగదారులు, ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్, డైరెక్టర్లు సుదర్శన్, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.