News August 15, 2025
సూర్యాపేట: జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News August 15, 2025
ADB: ఆ గ్రామంలో మొదటిసారి జెండా ఆవిష్కరణ

ASF(D) కెరమెరి(M) బాబేఝరి పంచాయతీ పరిధిలోని పాటగూడలో తొలిసారి త్రివర్ణపతాకం ఎగిరింది. దేశానికి స్వతంత్రం వచ్చి 79ఏళ్లు గడిచినా ఆ గ్రామంలో ఇప్పటి వరకు జెండా ఎగరేయలేదు. దాదాపు 30 ఇళ్లున్న గ్రామంలో బడి, ప్రభుత్వ కార్యాలయాలు లేకపోవడంతో ఎలాంటి కార్యక్రమాలు జరపలేదు. ఈసారి ప్రభుత్వ బడిని ప్రారంభించారు. గ్రామంలోని పిల్లలకు విద్య అందుతోందని, మొదటిసారి జాతీయ పతాకం ఎగిరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
News August 15, 2025
జీరో ఫేర్ టికెట్.. అమ్మా జర్నీ ఫ్రీ!

అనంతపురం జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. బుక్కరాయసముద్రం ఆర్టీసీ బస్టాండ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని MP లక్ష్మీనారాయణ, MLA శ్రావణి ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. జిల్లాలో 402 బస్సులను ఫ్రీ జర్నీకి కేటాయించారు.
News August 15, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: అల్పపీడనం ప్రభావంతో రేపు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. అటు, కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సా.5 గంటలకు 2,98,209 క్యూసెక్కులుగా ఉందని వెల్లడించింది.