News August 15, 2025
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి : మంత్రి నారాయణ

స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను తయారు చేశామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో జాతీయ పతాకాన్ని అయన ఆవిష్కరించారు.
Similar News
News August 16, 2025
నెల్లూరులో ఇద్దరు యువకుల మృతి

నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన ఆర్షద్(19), పోలయ్య(24) పినాకిని రైల్లో విజయవాడకు శనివారం బయల్దేరారు. మధ్యలో ఇద్దరూ డోర్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. నెల్లూరు, వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య కొండాయపాలెం గేట్ వద్ద ఇద్దరూ జారి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News August 16, 2025
గౌరవరంలో తేలుకుట్టి బాలుడి మృతి

కావలి మండలం గౌరవరానికి చెందిన చౌటూరి చిన్నయ్య కుమారుడు శ్రీనివాసులు (11) శనివారం తేలు కుట్టి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బాలుడు తమ ఇంటి వెనుక ఉన్న తాటి చెట్టుఎక్కి తాటిపండు కోస్తుండగా తేలు కుట్టింది. అతన్ని కావలి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరు రెఫర్ చేశారు. బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటపై రూరల్ పోలీస్‌లు కేసు నమోదు చేశారు.
News August 16, 2025
పెంచలకోనలో స్మగ్లర్ అరెస్ట్

రాపూరు మండలం పెంచలకోన వద్ద నాలుగు ఎర్రచందనం దుంగలు, ఒక స్మగ్లర్‌ను తిరుపతి టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పెంచలకోన అటవీ ప్రాంతంలో కుంబింగ్ చేపడుతుండగా ఈదలచెరువు వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన నాలుగు ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్‌ను తిరుపతి టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.