News April 1, 2024
శ్రీకాకుళం: 4,49,181 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 1,54,798 మంది రైతుల నుంచి 4,49,181 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదివారం తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు గాను రూ.980.56 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతులకు రవాణా ఇతర ఖర్చులు కూడా ఇందులోనే చెల్లించామని పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
శ్రీకాకుళం: కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
News March 7, 2026
శ్రీకాకుళం: వ్యవసాయ కూలీ కొడుకు సివిల్స్‌లో సత్తా

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ ఆల్ ఇండియా స్థాయిలో 463వ ర్యాంకు సాధించారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రామును తల్లి లక్ష్మి వ్యవసాయ పనులు చేస్తూ చదివించారు. జి.సిగడాం ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన ఆయన, వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం 11 నెలలు ఉద్యోగం చేసి, సివిల్స్ లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి సిద్ధమయ్యారు.
News March 7, 2026
పలాసలో అస్థిపంజరం కలకలం

పలాస(M) గోపాలపురం సమీపంలోని పెద్ద చెరువులో అస్థిపంజరం గూడును స్థానికులు శుక్రవారం గుర్తించారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఎముకుల గూడును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగి చాలా రోజులవడంతో..మృతుడి వివరాలకు ఆరా తీస్తున్నారు. ఈ దుస్తుల ఆధారంగా ఎవరైనా గుర్తిస్తే కాశీబుగ్గ పోలీసులను సంప్రదించాలని సీఐ రామకృష్ణ చెప్పారు.


