News August 15, 2025

విశాఖ కలెక్టరేట్లో జెండా ఎగరవేసిన కలెక్టర్

image

విశాఖ క‌లెక్ట‌రేట్లో శుక్ర‌వారం 79వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడులు ఘ‌నంగా జరిగాయి. క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయ‌న‌తో పాటు వీఎంఆర్డీఏ క‌మిష‌న‌ర్ కె.ఎస్. విశ్వ‌నాథ‌న్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ జాతీయ ప‌తాకానికి గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించారు. అనంత‌రం సందేశాన్ని అందించారు. వేడుక‌ల్లో భాగంగా సిబ్బందికి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News August 15, 2025

విశాఖలో 250 మంది బిచ్చగాళ్లకు షెల్టర్

image

రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ సీపీ నగరంలో బిక్షటాన చేస్తున్న 250 మందిని తీసుకువచ్చి షెల్టర్ కల్పించారు. చోడుపల్లి పైడమ్మ (77) శ్రీహరిపురంలో ఎండు చేపలు అమ్ముతూ ఉండేది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుమారుడు సాంబమూర్తి వెతకడం ప్రారంభించాడు. అయితే పోలీసులు చేసిన స్పెషల్ డ్రైవ్‌లో ఆమె పట్టుబడింది. పోలీసుల సంరక్షణలో ఉన్న ఆమెను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News August 15, 2025

విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతి

image

విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం 24 గంటల తర్వాత తీరానికి శుక్రవారం కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారం మేరకు మత్స్యకారులు, పోలీసుల సహకారంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 15, 2025

విశాఖలో గృహనిర్మాణశాఖ శకటానికి ప్రథమ బహుమతి

image

విశాఖలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖకు ప్రథమ స్థానం, జీవీఎంసీ శకటానికి ద్వితీయ స్థానం, విద్యాశాఖ శకటానికి తృతీయ స్థానం లభించింది. మరికొన్ని ప్రభుత్వ శకటాలు కూడా ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.