News August 15, 2025

‘రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తుంది’

image

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఘా జాతీయ జెండాను ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళుతుందన్నారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News August 15, 2025

రాజమండ్రి: విద్యుత్ శాఖ శకటానికే ప్రథమ స్థానం

image

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.

News August 15, 2025

APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

TG: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 118 పోస్టులను భర్తీ చేయనుంది. వేతనాలు, అర్హతలు, ఎంపిక విధానానికి సంబంధించిన వివరాలు అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. రాత పరీక్ష‌లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా నియామకాలు చేపడుతారు. 200 మార్కుల చొప్పున పేపర్​-1, పేపర్-2 పరీక్షలుంటాయి.

News August 15, 2025

రెబ్బెన: ఈనెల 23 నుంచి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

image

తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈనెల 23 నుంచి 24 వరకు రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని సింగరేణి గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న గోలేటిలోని సింగరేణి గ్రౌండ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 9381662413లో సంప్రదించాలన్నారు.