News August 15, 2025
‘ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ పాలన’

ఖమ్మం: ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలో నూతనంగా 24 వేల 818 కుటుంబాలకు రేషన్ కార్డ్‌లు జారీ చేశామని చెప్పారు. 3,37,898 మంది రైతుల ఖాతాలో రూ. 427 కోట్ల 38 లక్షల రైతు భరోసా నిధులు జమ చేసామని తెలిపారు. అలాగే జిల్లాలో 16 వేల 153 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
Similar News
News August 15, 2025
బహుమతులు పొందిన శకటాలు ఇవే..!

79వ భారత స్వాతంత్ర్య వేడుకలను శుక్రవారం బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిని ప్రదర్శించిన శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతి విద్యుత్ శాఖ, రెండో బహుమతి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మూడో బహుమతి మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు కైవసం చేసుకున్నాయి.
News August 15, 2025
చిత్తూరు: వైసీపీ నాయకుల పాదయాత్ర

మద్యం కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ చిత్తూరు ఇన్‌ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఆరోపించారు. ఆయన అరెస్టుకు నిరసనగా ఆందోళన చేశారు. దొడ్డిపల్లి సప్త కన్యకమ్మల ఆలయం నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మారిందని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
News August 15, 2025
విశాఖలో 250 మంది బిచ్చగాళ్లకు షెల్టర్

రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ సీపీ నగరంలో బిక్షటాన చేస్తున్న 250 మందిని తీసుకువచ్చి షెల్టర్ కల్పించారు. చోడుపల్లి పైడమ్మ (77) శ్రీహరిపురంలో ఎండు చేపలు అమ్ముతూ ఉండేది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుమారుడు సాంబమూర్తి వెతకడం ప్రారంభించాడు. అయితే పోలీసులు చేసిన స్పెషల్ డ్రైవ్‌లో ఆమె పట్టుబడింది. పోలీసుల సంరక్షణలో ఉన్న ఆమెను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.