News August 15, 2025

‘ADBలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’

image

ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి యూనివర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. ఈ విషయం స్పందించిన షబ్బీర్ అలీ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షి షాతో చర్చించారు.

Similar News

News October 28, 2025

ADB: అక్రమార్కులకు రాజకీయ అండదండలు..!

image

జిల్లాలో కొందరు రాజకీయ నాయకుల ముసుగులో రౌడీషీటర్లు, గూండాలు అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. నేతల అండతోనే రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి సారించి, రౌడీషీటర్ల అక్రమ భాగోతాలను వెలికితీస్తున్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు రావడంతో, పోలీసులు కొరడా ఝళిపించి ఇటీవల భూదందాలు, పలు వివాదాల్లోని రౌడీషీటర్లు, నాయకులను జైలుకు పంపారు.

News October 28, 2025

ఆదిలాబాద్‌లో బుధవారం పత్తి మార్కెట్ బంద్

image

అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసినందుకు ఈనెల 29న పత్తి మార్కెట్ కు బంద్ ఉంటుందని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. Kapas Kisan యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్‌ను రద్దు చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి మరుసటి పని దినాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పత్తి తేవద్దన్నారు.

News October 28, 2025

ADB: నారీమణులకు దక్కిన 10 మద్యం షాపులు

image

కొత్త మద్యం పాలసీ 2025–27లో 34 షాపులకు గాను ఆదిలాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా 10 షాపులు మహిళలకు లక్కీడ్రా ద్వారా దక్కాయి. షాప్‌ నం. 2, 9 విమలబాయి దక్కించుకున్నారు. తమ కుటుంబీకులకు సంబంధించిన మహిళల పేరిట షాపులు రావడంతో వారు సంబరాల్లో మునిగితేలారు. కాగా మద్యం లక్కీడ్రాకు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, అదృష్టవంతుల పేర్లు వచ్చాయి.