News August 15, 2025

జీరో ఫేర్‌ టికెట్‌.. అమ్మా జర్నీ ఫ్రీ!

image

అనంతపురం జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. బుక్కరాయసముద్రం ఆర్టీసీ బస్టాండ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని MP లక్ష్మీనారాయణ, MLA శ్రావణి ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో.. ఆధార్‌, రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒకటి చూపించి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. జిల్లాలో 402 బస్సులను ఫ్రీ జర్నీకి కేటాయించారు.

Similar News

News August 14, 2025

SKU అకాడమిక్ డీన్‌గా ప్రొఫెసర్ కృష్ణకుమారి నియామకం

image

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అకాడమిక్ డీన్‌గా ప్రొఫెసర్ ఆలూరు కృష్ణకుమారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ యూనివర్సిటీ ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్ బి.అనిత, రిజిస్ట్రార్ రమేశ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈమె ఎస్కేయూ కళాశాల ప్రిన్సిపల్‌గా, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఈమె జియోగ్రఫీ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

News August 14, 2025

రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించండి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని అనంతపురం ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లు, రీసర్వే డీటీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో RDO, MRO, డిప్యూటీ MRO బాధ్యతగా పనిచేసి, కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

News August 13, 2025

వచ్చే 2 రోజుల పాటు వర్ష సూచన

image

అధిక వర్షాల కారణంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందదని అన్నారు. వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పంట పొలాలపై శ్రద్ధ వహించి అప్రమత్తంగా ఉండాలన్నారు. చీడపీడలు సంభవిస్తే సంబంధిత అధికారులు లేదా శాస్త్రవేత్తలను సంప్రదించాలన్నారు.