News August 15, 2025
ఏలూరు: వ్యవసాయ శాఖకు ప్రథమ బహుమతి

ఏలూరులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి స్టాల్స్‌ను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ సాధికారిక సంస్థ మొదటి బహుమతి, ఉద్యానవన శాఖ రెండో బహుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ మూడో బహుమతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నాలుగో బహుమతి గెలుచుకున్నాయి.
Similar News
News August 16, 2025
మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా అక్కడ బంద్‌కు పిలుపు

TG: మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. నార్త్ ఇండియా నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మార్వాడీలు అన్ని వ్యాపారాలకు విస్తరిస్తున్నారని, వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తుండటంతో స్థానికులకు ఉపాధి లభించట్లేదంటున్నారు. ఈ నేపథ్యంలో AUG 18న రంగారెడ్డి(D) ఆమనగల్లు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు లోకల్ వ్యాపారులు ప్రకటించారు.
News August 16, 2025
పెద్దపల్లి: ‘విద్యా-ఉపాధి రంగాల్లో విశేష ఫలితాలు’

PDPLలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా విద్యా, ఉపాధి రంగాలపై మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ₹15.81కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేశామని, AI టూల్స్, IFP ప్యానల్స్ బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. 561మందికి ఉపాధి కల్పిస్తూ ₹39 కోట్ల పెట్టుబడితో 44వ్యాపార యూనిట్లు, T-ప్రైడ్, T-ఐడియా ద్వారా ₹2.41కోట్ల సబ్సిడీ మంజూరైందన్నారు.
News August 16, 2025
పెద్దపల్లి: ‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి’

PDPLలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా కింద 1,51,507 మంది రైతుల ఖాతాల్లో ₹161.02 కోట్లు జమ చేశామని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు ₹155.80 కోట్లు ఆదా అయిందన్నారు. గృహ జ్యోతి, ₹500 గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డులు వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.