News August 15, 2025

HYD: స‌హ‌జ‌వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి ల‌క్ష్యం కావాలి: కమిషనర్

image

సహజ వనరుల పరిరక్షణ అందరి లక్ష్యంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలా చేస్తేనే మెరుగైన జీవనం సాధ్యమని చెప్పారు. శుక్రవారం HYDలోని హైడ్రా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి)లో సహజ వనరుల సంరక్షణను ప్రస్తావించారని, దాని ప్రకారమే నగరంలోని గొలుసుకట్టు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు.

Similar News

News August 16, 2025

ప్రశంస పత్రం అందుకున్న సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి శుక్రవారం ప్రశంసా పత్రం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితేలు అందించారు. ఈ సందర్భంగా సీఐ మొగిలిని పలువురు అభినందించారు.

News August 16, 2025

రజినీకాంత్‌కు మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు

image

సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీది ఒక ఐకానిక్ జర్నీ. ఎన్నో జనరేషన్స్‌ను మీ విభిన్న పాత్రలతో అలరించారు. మీ ప్రయాణం ఇంతే విజయవంతంగా కొనసాగాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘నటుడిగా అలరించడమే కాకుండా.. మీ చిత్రాలతో సమాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు’ అని సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

News August 16, 2025

కథలాపూర్: సౌదీ దేశం నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన సంగెం వినోద్(30) సౌదీ అరేబియా దేశంలో గత నెల 22న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం శుక్రవారం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. వినోద్ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అక్కడ కార్మికుడిగా పని చేస్తున్నప్పటికీ సరైన వేతనం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.