News April 1, 2024

పులివెందుల ఫస్ట్.. ఎర్రగుంట్ల థర్డ్

image

ఇంటి, నీటి పన్నుల వసూళ్లలో పులివెందుల మొదటి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ కమిషనర్ తెలిపారు. జిల్లాలో పన్ను వసూళ్లలో పులివెందుల 83.90%తో ప్రథమ స్థానంలో నిలిచింది. కడప 82.8% ద్వితీయ స్థానం, ఎర్రగుంట్ల 77.30 % మూడో స్థానాల్లో ఉన్నట్లు కమిషనర్లు తెలిపారు. మున్సిపల్ సచివాలయ ఉద్యోగుల కృషితో, వినియోదారుల సహకారంతో పన్ను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News April 6, 2026

కడప జిల్లా సరిహద్దుల్లో మార్పులు

image

జిల్లాల పునర్వ్యవస్థీకరణతో సరిహద్దుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 7 జిల్లాల సరిహద్దులు కలిగిన ఏకైక జిల్లాగా కడప జిల్లా నిలిచింది. అన్నమయ్య జిల్లా మార్పులతో రూపురేఖలు పూర్తిగా మారాయి. కొన్ని నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లోకి విలీనం చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి చేరడంతో కొత్త సరిహద్దులు ఏర్పడ్డాయి. భౌగోళికంగా కడప జిల్లా కేంద్ర స్థానంలో ఉండటంతో ప్రాధాన్యం పెరిగింది.

News April 6, 2026

BREAKING: కడపలో దారుణ హత్య

image

కడప రిమ్స్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం కడప శివారులోని అలంఖాన్‌పల్లి జాతరలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో దస్తగిరి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తితో పొడిచారు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన కుమారుడికి గాయాలై రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2026

కడప జిల్లాకు కోట్ల ఆదాయం ఇలా.!

image

☞ మద్యం అమ్మకాల ద్వారా రూ.1,151.81 కోట్లు ☞ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.278.05 కోట్లు ☞ రవాణా శాఖ ద్వారా రూ.195.21 కోట్లు ☞పట్టణాల్లో ఇంటి పన్ను రూ.99.40 కోట్లు ☞ GST వసూళ్ల ద్వారా రూ.68.40 కోట్లు ☞ పట్టణాల్లో నీటి పన్ను రూ.16.95 కోట్లు ☞ AMCల ద్వారా రూ.13.37 కోట్ల ఆదాయం లభించింది.