News August 15, 2025

HYD: స‌హ‌జ‌వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి ల‌క్ష్యం కావాలి: కమిషనర్

image

సహజ వనరుల పరిరక్షణ అందరి లక్ష్యంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలా చేస్తేనే మెరుగైన జీవనం సాధ్యమని చెప్పారు. శుక్రవారం HYDలోని హైడ్రా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి)లో సహజ వనరుల సంరక్షణను ప్రస్తావించారని, దాని ప్రకారమే నగరంలోని గొలుసుకట్టు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు.

Similar News

News August 16, 2025

HYD: కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు కధీరవన్ పళని, జి.ముకుంద రెడ్డి, డీఆర్ఓ ఈ.వెంకటాచారితో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

News August 16, 2025

HYD: కోకాపేట్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

HYD కోకాపేట్ పరిధిలోని పోలువామి 90 విలాస్ ముందు ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రోడ్డు దాటుతున్న సమయంలో టాండాల మంజుల(44) అనే మహిళను దత్తుచంద్ర అనే వ్యక్తి బుల్లెట్ బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. మంజుల గాంట్లకుంట పరిధి కన్వాయిగూడెం తండాకు చెందిన మహిళ అనే నార్సింగి పోలీసులు తెలిపారు.

News August 15, 2025

ఆ కష్టాలు మళ్లీ రాకుండా GHMC ముందు జాగ్రత్త..!

image

2020, 2023లో భారీ వర్షాల కారణంగా గ్రేటర్ HYD పరిధిలోని పలు చెరువులు నిండి కట్టలు తెగి బస్తీలు, కాలనీల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ఆ సమస్య ఉత్పన్నం కాకుండా గ్రేటర్ అధికారులు చెరువుల ఎఫ్టీఎల్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎఫ్టీఎల్‌కు రెండు అడుగుల తక్కువగానే నీరుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎఫ్టీఎల్‌కు దగ్గరగా నీటి మట్టం పెరిగితే నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.