News August 15, 2025
ADB: పోలీసు అధికారులకు రాఖీ కట్టిన విద్యార్థులు

మిషన్ శక్తి, DHEW బృందం, శిశు గృహ పిల్లలతో కలిసి హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా పిల్లలు రాఖీలు కట్టారు. విద్యార్థులే స్వయంగా ఇండియన్ ఫ్లాగ్‌తో రాఖీలు తయారు చేసి శుక్రవారం పోలీస్ అధికారులకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద, కృష్ణవేణి, కోటేశ్వర రావు, నిఖలేశ్వర్, వెంకటేశ్, శిశు గృహ సిబ్బంది, పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News August 16, 2025
ADB: ప్రేమకు ప్రతిరూపం రాధాకృష్ణులు

కృష్ణుడి ప్రేమ, ఆధ్యాత్మికతకు ప్రతీక రాధ. రాధాకృష్ణుల ప్రేమ బంధాలకు అతీతమైనది. వారి అనుబంధం దైవిక ప్రేమ, నిస్వార్థ భక్తికి నిలువెత్తు నిదర్శనం. భీంపూర్(M)లో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం గుబిడిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో చిన్నారులు వేసిన శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలు తిలకించేందుకు గ్రామస్థులు ఒకచోట చేరారు.
News August 16, 2025
ADB: రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలు ప్రారంభం

క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు విజేతనే అని తెలంగాణ రాష్ట్ర బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు హరిశంకర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ బేస్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రం నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొనగా వారికి అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పించారు. జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.
News August 16, 2025
NRG: ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

నేరడిగొండ మండలంలోని మథుర(కైతి లంబాడ) కులస్థులు శ్రీ కృష్ణాష్టమి శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలంతా కలిసి సంప్రదాయ పద్ధతిలో మట్టిని తెచ్చి దానితో శ్రీకృష్ణుని ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమను తమ ఇంట్లో ప్రతిష్టిస్తామని తెలిపారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించిన సమయం అనంతరం ఆ ప్రతిమకు ఓమా, బంక, బెల్లం, గోధుమ పిండితో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తామని మహిళలు పేర్కొన్నారు.