News August 15, 2025

ADB: రాగి తీగలు చోరీ.. ముగ్గురి అరెస్ట్

image

రాగి తీగలు చోరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఎస్ఐ రమ్య సీసీఐ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన మహారాష్ట్రకు చెందిన దేవీదాస్, లాండసాంగికి చెందిన రాజేశ్వర్, శివాజీలను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద ఉన్న సంచిలో 30 కిలోల రాగి తీగలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News August 15, 2025

రాష్ట్రపతి విందులో పాల్గొన్న ADB ఉపాధ్యాయుడు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోని at home కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ఆదిలాబాద్ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుతులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విందులో పాల్గొన్నారు. కైలాస్ రాష్ట్రపతి, ప్రధానీకి గోండి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్పించాలని విన్నవించారు.

News August 15, 2025

ADB: ‘పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి’

image

CPSను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని PRTU TS జిల్లాధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినం గోడప్రతులను జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News August 15, 2025

ADB: పోలీసు అధికారులకు రాఖీ కట్టిన విద్యార్థులు

image

మిషన్ శక్తి, DHEW బృందం, శిశు గృహ పిల్లలతో కలిసి హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా పిల్లలు రాఖీలు కట్టారు. విద్యార్థులే స్వయంగా ఇండియన్ ఫ్లాగ్‌తో రాఖీలు తయారు చేసి శుక్రవారం పోలీస్ అధికారులకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద, కృష్ణవేణి, కోటేశ్వర రావు, నిఖలేశ్వర్, వెంకటేశ్, శిశు గృహ సిబ్బంది, పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు.