News August 15, 2025
రెబ్బెన: ఈనెల 23 నుంచి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈనెల 23 నుంచి 24 వరకు రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని సింగరేణి గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న గోలేటిలోని సింగరేణి గ్రౌండ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 9381662413లో సంప్రదించాలన్నారు.
Similar News
News August 16, 2025
కాసేపట్లో భారీ వర్షాలు: TGiCCC

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ కమాండ్&కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తెల్లవారుజామున 4 గంటల్లోపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజులు పంపింది.
News August 16, 2025
అల్లూరి జిల్లా ఎస్పీ, జేసీలకు ప్రశంసాపత్రాలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రశంసాపత్రాలు, అవార్డులను అందుకున్నారు. పాడేరులో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్ వాటిని అందించారు. అలాగే పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అదనపు ఎస్పీ ధీరజ్, చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్ కూడా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
News August 16, 2025
ADB: GREAT.. బడి కోసం రూ.60 లక్షల భూదానం

భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల క్రీడా స్థలం కోసం గ్రామానికి చెందిన పన్నాల భూమారెడ్డి, సంజీవరెడ్డి దాదాపు రూ.60 లక్షల విలువైన 1.5 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు గ్రామ పెద్దలు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు.