News August 15, 2025

మేడ్చల్: ప్రోత్సాహక చెక్కులు అందించిన కలెక్టర్

image

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు చెక్కులు అందజేశారు. జానం సోనీ(579), చీకటి త్రివేణి(572), కుర్మ రాజ్ కుమార్(563), శీలంశెట్టి సాయి విఘ్నేశ్ (561)కి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.40,000 ప్రోత్సాహకం అందజేశారు. భవిష్యత్‌లో మరింత శ్రమించి ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు.

Similar News

News August 16, 2025

కాసేపట్లో భారీ వర్షాలు: TGiCCC

image

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ కమాండ్&కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తెల్లవారుజామున 4 గంటల్లోపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజులు పంపింది.

News August 16, 2025

అల్లూరి జిల్లా ఎస్పీ, జేసీలకు ప్రశంసాపత్రాలు

image

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రశంసాపత్రాలు, అవార్డులను అందుకున్నారు. పాడేరులో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్ వాటిని అందించారు. అలాగే పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అదనపు ఎస్పీ ధీరజ్, చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్ కూడా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

News August 16, 2025

ADB: GREAT.. బడి కోసం రూ.60 లక్షల భూదానం

image

భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల క్రీడా స్థలం కోసం గ్రామానికి చెందిన పన్నాల భూమారెడ్డి, సంజీవరెడ్డి దాదాపు రూ.60 లక్షల విలువైన 1.5 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు గ్రామ పెద్దలు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు.