News August 15, 2025
బహుమతులు పొందిన శకటాలు ఇవే..!

79వ భారత స్వాతంత్ర్య వేడుకలను శుక్రవారం బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిని ప్రదర్శించిన శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతి విద్యుత్ శాఖ, రెండో బహుమతి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మూడో బహుమతి మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు కైవసం చేసుకున్నాయి.
Similar News
News August 16, 2025
చిత్తూరు జిల్లా టీచర్ల గమనిక

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2025కు అర్హులైన హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఈనెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి ఓ ప్రకటనలో కోరారు. 10 ఏళ్ల సర్వీసు ఉన్నవారు అర్హులన్నారు. ప్రతిపాదనలు రెండు కాపీలను ఉపవిద్యా శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన ప్రతిపాదనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
News August 16, 2025
KMR: లంబాడాలు కృష్ణాష్టమిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

కృష్ణాష్టమిని కామారెడ్డి జిల్లాలో వెరైటీగా నిర్వహిస్తారు. గాంధారి, పెద్ద కొడప్గల్ మండలాల్లోని మథుర లబానా, లంబాడాలు సంప్రదాయ దుస్తులు ధరించి చేలల్లో నుంచి సేకరించిన మట్టి, బావి నుంచి తెచ్చిన నీటితో ప్రతి ఇంటిలోనూ కృష్ణుడి ప్రతిమను తయారు చేస్తారు. ‘మాల్ పూరి’ అనే తీపి పదార్థాన్ని తయారు చేసి, నైవేద్యం సమర్పించి పూజలు చేస్తారు. మరుసటి రోజు ప్రతిమలను చెరువుల్లో నిమజ్జనం చేసి వేడుకను ముగిస్తారు.
News August 16, 2025
BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. TGలోని నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, SRD, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే ASF, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, PDPL, MHBD, WGL, VKB, MDK జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.