News August 15, 2025

HYD: అద్భుత రూపంలో శ్రీదుర్గాదేవి అమ్మవారు

image

HYD ఎల్బీనగర్ పరిధి మన్సూరాబాద్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం నాలుగో శుక్రవారం వేళ అమ్మవారిని గాజులతో అలంకరించారు. నిమ్మకాయల దండ వేశారు. అమ్మవారు భక్తులకు అద్భుతంగా దర్శనమిచ్చారు. మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి దర్శించుకుంటున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ పోచబోయిన గణేశ్ యాదవ్ తెలిపారు.

Similar News

News August 16, 2025

HYD: నమ్రతతో పాటు ఆమె కొడుకు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

సృష్టి కేసులో నమ్రతతో పాటు ఆమె కొడుకు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. నమ్రత నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె ఆస్తులపై విచారణ జరపాల్సి ఉందని పోలీస్ తరఫు న్యాయవాది వాదించారు. నమ్రత కంపెనీలపై దర్యాప్తు జరపాల్సి ఉందని చెప్పారు. మరోవైపు తన కొడుకు పెళ్లి ఉందని కోర్టుకు నమ్రత తెలిపింది. ఇరువాదనల తర్వాత బెయిల్ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.

News August 16, 2025

HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

image

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. రామంతపూర్‌లో నివాసముండే ఓ వ్యక్తి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న కుమారుడు కనిపించడం లేదంటూ PSలో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కమర్ అనే వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.

News August 16, 2025

HYD: 9 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు

image

వచ్చే నెల 9 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలో వివిధ డిగ్రీ కోర్సుల్లో చదివి ఫెయిల్ అయిన విద్యార్థులు వన్ టైం ఛాన్స్ పరీక్షకు అర్హులన్నారు. ఓయూ క్యాంపస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో వన్ టైం ఛాన్స్ పరీక్షకు ఫీజులు చెల్లించవచ్చని కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు.