News August 15, 2025
విశాఖలో నకిలీ మద్యం తయారీ.. ఒకరు అరెస్టు

సీతంపేటలో నకిలీ మద్యం తయారు చేస్తున్న కట్టమూరి రామకృష్ణను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. అతని వద్ద నుంచి 70 నకిలీ మద్యం సీసాలు, 1.5lts హోమియోపతి స్పిరిట్, 225 వివిధ బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలు, 76 లిక్కర్ ప్యాకేజ్ కవర్ల లేబుల్స్ మూతలు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ రవి కిరణ్, ఎస్ఐ ముసలి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News August 16, 2025
పెందుర్తిలో అత్యధిక వర్షపాతం నమోదు

పెందుర్తిలోని అత్యధికంగా వర్షపాతం నమోదయింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెందుర్తి పరిసర ప్రాంతాల్లోనీ 66.4 మీ.మీ.వర్షపాతం నమోదయింది. పద్మనాభంలో 28.6 మీ. మీ, ఆనందపురం 15.6 మీ.మీ, ములగాడ 8.2 మీ.మీ., గోపాలపట్నం 7.4 మీ. మీ, విశాఖపట్నం రూరల్ 6.8.మీ.మీ వర్షం పడింది. ఇల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 162.0 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News August 16, 2025
విశాఖ: పేలుడు ఘటనలో మరో వ్యక్తి మృతి

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద వెల్డింగ్ దుకాణంలో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతున్న ముగ్గురులో గంగారావు కేజీహెచ్‌లో శుక్రవారం మృతి చెందాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News August 16, 2025
పెద్ద సంఖ్యలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం: కమిషనర్

VMRDA పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదించామని కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. విశాఖ, విజయనగరం అనకాపల్లి జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. పలు ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధికి చేస్తున్నామన్నారు.