News August 15, 2025

కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి: సీఐటీయూ

image

కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.

Similar News

News August 16, 2025

HYD: నమ్రతతో పాటు ఆమె కొడుకు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

సృష్టి కేసులో నమ్రతతో పాటు ఆమె కొడుకు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. నమ్రత నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె ఆస్తులపై విచారణ జరపాల్సి ఉందని పోలీస్ తరఫు న్యాయవాది వాదించారు. నమ్రత కంపెనీలపై దర్యాప్తు జరపాల్సి ఉందని చెప్పారు. మరోవైపు తన కొడుకు పెళ్లి ఉందని కోర్టుకు నమ్రత తెలిపింది. ఇరువాదనల తర్వాత బెయిల్ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.

JGTL: ఎడమొహం, పెడమొహంగా MLA, మాజీమంత్రి

image

జగిత్యాల కాంగ్రెస్‌లో కొన్నిరోజులుగా ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం JGTLలో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా MLA సంజయ్ కుమార్, మాజీమంత్రి జీవన్ రెడ్డి ఎడమొహం, పెడమొహంగా ఒకే వేదికపై కూర్చుని కనిపించారు. అలాగే బుధవారం జీవన్ రెడ్డి తమ్ముడి కూతురు వివాహ వేడుకలో కూడా ఇదే సీన్ కన్పించింది. వీటిని చూసినవారు ఇరువురి ఆధిపత్య పోరుపై పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు.