News August 16, 2025
పెద్దపల్లి: ‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి’

PDPLలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా కింద 1,51,507 మంది రైతుల ఖాతాల్లో ₹161.02 కోట్లు జమ చేశామని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు ₹155.80 కోట్లు ఆదా అయిందన్నారు. గృహ జ్యోతి, ₹500 గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డులు వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
Similar News
News August 16, 2025
జగన్ జెండా ఆవిష్కరించకపోవడం విచారకరం: ధూళిపాళ్ల

AP: నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా YS జగన్ జాతీయ జెండా ఆవిష్కరణకు బయటకు రాకపోవడం శోచనీయమని TDP MLA ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ‘ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగురవేయని మాజీ CMగా, పార్టీ చీఫ్‌గా నిలిచారు. ఇలా చేయడం దేశాన్ని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని, జెండాను అవమానించడమే. పులివెందుల ఓటమి ఫ్రస్ట్రేషన్ దీనికి కారణం కావొచ్చు. జగన్ జెండా ఆవిష్కరించకపోవడం విచారకరం’ అని Xలో మండిపడ్డారు.
News August 16, 2025
అమ్రాబాద్: పశువుల యజమానులకు పరిహారం చెల్లింపు

టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేష్ తెలిపారు. 2020–21లో 33 పశువులకు రూ.3.69 లక్షలు, 2022–23లో 85 పశువులకు రూ.11.75 లక్షలు, 2023–24లో 81 పశువులకు రూ.8.93 లక్షలు, 2024–25లో 58 పశువులకు రూ.5.51 లక్షలు, 2025–26లో 6 పశువులకు రూ.79 వేల పరిహారం యజమానులకు చెల్లించామని ఆయన వివరించారు.
News August 16, 2025
గోవిందరావుపేట: 32 ఫీట్లకు చేరిన లక్నవరం సరస్సు

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు ఉద్ధృతంగా ప్రవర్తిస్తోంది. కాగా, 32 ఫీట్లకు నీటిమట్టం చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సరస్సు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ సమయంలోనైనా మత్తడి పొంగే అవకాశం ఉందని, సరస్సులో మత్స్యకారులు, స్థానిక ప్రజలు దిగరాదన్నారు.