News August 16, 2025
పెద్దపల్లి: ‘విద్యా-ఉపాధి రంగాల్లో విశేష ఫలితాలు’

PDPLలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా విద్యా, ఉపాధి రంగాలపై మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ₹15.81కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేశామని, AI టూల్స్, IFP ప్యానల్స్ బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. 561మందికి ఉపాధి కల్పిస్తూ ₹39 కోట్ల పెట్టుబడితో 44వ్యాపార యూనిట్లు, T-ప్రైడ్, T-ఐడియా ద్వారా ₹2.41కోట్ల సబ్సిడీ మంజూరైందన్నారు.
Similar News
News August 16, 2025
నిర్మల్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో, నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రదేశాలకు ఎవరూ వెళ్లొద్దని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, ఏదైనా ఇబ్బంది వస్తే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నంబరు 91005 77132ను సంప్రదించాలన్నారు.
News August 16, 2025
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే లాస్ట్ డేట్!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు విభాగాల్లో 5,220 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాగా, అప్లై చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) 4,987 <
News August 16, 2025
కడెం ప్రాజెక్ట్ దిగువ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాలు అధికంగా కురిసి, ప్రాజెక్టు గేట్లను ఎత్తినందున.. కడెం ప్రాజెక్టు దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి పశువుల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల, స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.